Skip to content

Blog

కాల ప్రయాణం – కాలమై ప్రారంభం

కొన్ని ప్రయాణములు మధురము
ఆ తోటి ప్రయాణికులు సుమధురము
కొంత సమయమే అయినను మరువలేము !!

అలాంటి ప్రయాణములు దొరికిన వరములు
మన గమనము చేరుకోవడానికి సోపానములు !!

ఆ ప్రయాణం ముందుగానే కాల లిఖితం
ఆలస్యమయినను అది కాగల ప్రారంభం !!

ఆ జ్ఞానం తోడుగా దగ్గర కాగల దూరం
ఆ పరిచయం నీడగా సమస్య వెంటే సమాధానం
ఆ అనుభవం ధైర్యమై అకాలమయినను ఆరోగ్యం
ఆ ఆతిథ్యం ఆశీస్సులై నిత్య సత్య ధర్మ కాల అక్షరం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

అక్షర సిరుల శ్రీకారం – అమ్మగా అక్షర శ్రీకారం

అక్షరముల శ్రీకారం
సులక్షణముల శ్రీకారం
విలక్షణమయిన శ్రీకారం !!

ఆ అక్షరములు ఆశీస్సులుగా శ్రీకారం
ఆ సులక్షణములు ఆహార్యముగా శ్రీకారం
విలక్షణమయిన బోధన ప్రక్రియగా శ్రీకారం !!

కళలను కనులకు చేరువచేయ శ్రీకారం
అక్షరములకు అడుగులను దరిచేయ శ్రీకారం
ఆ కనుల కళలతో గమనం కమనీయమవగ శ్రీకారం
ఆ అక్షరముల అడుగులతో గమ్యం రమణీయమవగ శ్రీకారం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

ఆది ఆద్యంతం అనుక్షణం విరచితం

ఆ ప్రయాణం తలపించు కురుక్షేత్రం
ఆ గమనం కూడిన నిత్య సత్య భక్తిభావం
ఆ సామర్థ్యం సర్వదా క్రమశిక్షణ పూరితం
ఆ పఠనం సహస్రనామ విరచిత పూజితం
ఆ సామరస్యం జ్ఞానవిజ్ఞాన ఆధ్యాత్మిక దైవికం
ఆ పాండిత్యం భాష సంకల్పిత సమ్మోహన సమ్మేళనం !!

నాడు కనులలో కదలాడిన విలాపం
చెవులలో మారుమ్రోగిన ఆ ప్రళయం !!

పాదములు మరచిన ఆ అడుగులు
పదములు వెనుకబడిన క్షణములు !!

విశ్రాంతి కోరిన అవిరామ ఆలోచనలు
నిశ్చలత్వం చుట్టుముట్టిన పరుగులు !!

అడుగుజాడలు మరచిన నిదుర కలలు
చీకటిని దరిచేరని కమ్మని నాట్య కళలు !!

వినయం విభూషణమై
సంప్రదాయం ఆహార్యమై
సంస్కారం సస్యశ్యామలమై
అంధకారం అడుగుతీసి వేయనిదై !!

అమ్మగా సాక్షాత్కారం
అక్షరముగా సాగర పయనం
అణువణువునా కొలువైన ధ్యానం
అజరామరముగా నిలిచినదై ఆ ఆశీర్వాదం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

తొలకరి ఆగమనం – పుడమి ఆహ్వానం

తొలకరి చినుకుల జాడ
వెచ్చని తనువుల చల్లని నీడ !!
శీతల పానీయాలకు వీడ్కోలు పలకగ
దుక్కిదున్నె పనికి ఆహ్వానం అందగ !!
ప్రకృతి నూతనోత్సాహం చూపగ
ఆ వాన నీటిని అదుపులో పెట్టగ !!
పుడమి కప్పుకునే ఈ పచ్చదనం
చూడముచ్చటైన ఆ వ్యవసాయం !!
వారంతములో వెళ్ళి చూడగ పొలం
తెలిసి వచ్చే ఆ ప్రకృతి అనుబంధం
చిగురులేసేనా ఎండిపోతున్న మానవత్వం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

ఈ ప్రతిబింబం – ఆ ప్రతిరూపం

నిశ్చలం నిర్మలం
ఆనందం గమనం
ఆంగికం ఆహార్యం
వినిమయం విరచితం !!

జ్ఞానం సమస్తం
నిర్మాల్యం పవిత్రం
మానవీయం మానవత్వం
స్వయంకృపం సాంసిద్ధికం !!

క్రోధం దహనం
ఆగ్రహం అంధకారం
అనాలోచితం అపజయం !!

అహం ఇహం అహంభావం
అనుబంధం బంధం ఇదం
ధ్యానం ధర్మం దైవం మోక్షం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

కనుల రణం – జయించిన ఆత్మస్థైర్యం

ఆ కనులు చూడక చూసిన యుద్ధం
వింటినారి లేకున్నను జరిగిన ఆ రణం !!

చూడ కాలమే గాఢాంధకారం
ప్రతిక్షణం తెలియని పోరాటం
ఆ కనుల జారే కన్నీరు విరచితం
ఆ మరణమృదంగం సుపరిచితం !!

ఆ సమయం చూడగ ఎదుట నరకం
ఆ విరామం కోరుకోలేని రుధిర విలాపం !!

మరపుకు రాలేని సువర్ణాక్షర అనుభవం
నేటి మార్పుకు ఒకనాటి తొలకరి దోహదం !!

ఆ చీకటి తోడుగా సదా ఒక ఉదయం
ఈ ఉదయ నిలువగ ప్రతిదినం శుభోదయం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

అక్షర ప్రతిబింబం శ్రీకారం

సిద్ది బుద్ది నేర్చిన అక్షరం
వేకువ వెన్నెల రాసిన అక్షరం
ప్రగతి ప్రణవం పాడిన అక్షరం
విజయం ధైర్యం దిద్దిన అక్షరం
సంప్రదాయం సౌశీల్యం అద్దిన అక్షరం !!

ధర్మం సత్యం పరిచయం చేసిన అక్షరం
వెలుగు చీకటి తారతమ్యం చూపిన అక్షరం !!

ఓంకార నిలయం శ్రీకారం
అక్షరముల అనుబంధం శ్రీకారం !!

అచ్చుల అల్లిక శ్రీకారం
హల్లుల హరివిల్లు శ్రీకారం
పదముల పారిజాతం శ్రీకారం !!

ఒత్తుల జలపాతం శ్రీకారం
గుణింతముల గర్భం శ్రీకారం !!

వ్యాసముల వ్యాకరణ వాహిని శ్రీకారం
శిష్యులు ఆశీర్వదించ కైలాసం శ్రీకారం
గురువులు కొలువైన శ్వేతసంద్రం శ్రీకారం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

అమ్మ నిలువగ దేవాలయం

కాకుల గుంపులో కోకిల
కలువల మాటున వెన్నెల
తారల వరుసలో ధ్రువతారల
కొంగల సమూహములో హంసల !!

నిలిచిన చోటే ఆలయం
తాండవించిన స్థలం కైలాసం
జగము నిండిన అమ్మ హృదయం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

సురక్షిత రవి సలక్షణం

గమనములో తేజం
ధర్మముతో గమనం
కాలములో ధర్మం
తనతో కాలం !!

తనలో తానై
తానే భగవత్ స్వరూపమై
సదా సర్వదా ప్రకాశించువాడై !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

బంధం కురిసే మేఘం

ఆ ప్రయాణం అలల గమనం
ఆ స్నేహం సూర్యచంద్రుల నియమం !!

ఆ బంధం నీరు కూడిన మేషం
ఆ దూరం రెండు కనుల నడుమ శూన్యం !!

ఆ వైరం వీనులవిందు సంగీతం
ఆ సందేశం భావితరములకు ఉపదేశం !!

ఆ అనురాగం మానవత్వ సంకేతం
ఆ అనుబంధం పెద్దల ఆశీర్వాదం !!

కాన కళ్ళెదుట నిత్య సత్యం
గడిచిపోతున్న చక్కటి జ్ఞాపకం
వర్తమానం విలువల ఆరోగ్యకాలం
తెరిచి చూడ ఎదుట ఆ భవితవ్యం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️