Skip to content

Writings

కాల ప్రయాణం – కాలమై ప్రారంభం

కొన్ని ప్రయాణములు మధురము
ఆ తోటి ప్రయాణికులు సుమధురము
కొంత సమయమే అయినను మరువలేము !!

అలాంటి ప్రయాణములు దొరికిన వరములు
మన గమనము చేరుకోవడానికి సోపానములు !!

ఆ ప్రయాణం ముందుగానే కాల లిఖితం
ఆలస్యమయినను అది కాగల ప్రారంభం !!

ఆ జ్ఞానం తోడుగా దగ్గర కాగల దూరం
ఆ పరిచయం నీడగా సమస్య వెంటే సమాధానం
ఆ అనుభవం ధైర్యమై అకాలమయినను ఆరోగ్యం
ఆ ఆతిథ్యం ఆశీస్సులై నిత్య సత్య ధర్మ కాల అక్షరం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

భాస్కర ప్రభాత ప్రకాశమా

తన రాక
కోసమే చూసెను ఎన్నెన్నో కనులు !!
తన కిరణములు
సోకగ ఈ తనువు పులకరించెను !!
తన వెలుగుల
జల్లులతో ఆలోచనలు తడిసెను !!
తన రూపం
ఎదుట నిలువగ ఈ మది నిండెను !!
తానే లేక
కాలమే అంధకారం అల్లుకొనెను !!!

✍️ శ్రీ తేజ కలం ✍️

తులసి వనములో కాచిన వెన్నెల

తులసి వనములో కాచిన వెన్నెల
తొంగి చూసెను నేడు ఎందుకో అల
ఇంటి ముందరను నింపెను దివ్వెల
దివి నుండి భువికి ఆ శశి రాక ఇల
ఈ శశి రాసిన అక్షరములలో అల్లికల అల !!

✍ శ్రీతేజం కలం ✍
🕉 అమ్మ ఆశీర్వాదం 🕉