Skip to content

ఆది ఆద్యంతం అనుక్షణం విరచితం

ఆ ప్రయాణం తలపించు కురుక్షేత్రం
ఆ గమనం కూడిన నిత్య సత్య భక్తిభావం
ఆ సామర్థ్యం సర్వదా క్రమశిక్షణ పూరితం
ఆ పఠనం సహస్రనామ విరచిత పూజితం
ఆ సామరస్యం జ్ఞానవిజ్ఞాన ఆధ్యాత్మిక దైవికం
ఆ పాండిత్యం భాష సంకల్పిత సమ్మోహన సమ్మేళనం !!

నాడు కనులలో కదలాడిన విలాపం
చెవులలో మారుమ్రోగిన ఆ ప్రళయం !!

పాదములు మరచిన ఆ అడుగులు
పదములు వెనుకబడిన క్షణములు !!

విశ్రాంతి కోరిన అవిరామ ఆలోచనలు
నిశ్చలత్వం చుట్టుముట్టిన పరుగులు !!

అడుగుజాడలు మరచిన నిదుర కలలు
చీకటిని దరిచేరని కమ్మని నాట్య కళలు !!

వినయం విభూషణమై
సంప్రదాయం ఆహార్యమై
సంస్కారం సస్యశ్యామలమై
అంధకారం అడుగుతీసి వేయనిదై !!

అమ్మగా సాక్షాత్కారం
అక్షరముగా సాగర పయనం
అణువణువునా కొలువైన ధ్యానం
అజరామరముగా నిలిచినదై ఆ ఆశీర్వాదం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *