Skip to content

Sree Teja Kalam

Nunc eget lorem dolor sed viverra. Tellus cras adipiscing enim eu turpis egestas pretium aenean. Egestas egestas fringilla phasellus faucibus scelerisque.

About Sree Teja Kalam

శశికాంత్ మెంచు అపుడెపుడో సూర్యాపేట పట్టణములో (నల్గొండ జిల్లాలో) దసరా పండుగ సంబరముల నడుమ జన్మించినాడు. మెంచు సుజాత మరియు మెంచు మల్లయ్య గార్ల ద్వితీయ పుత్రుడు, అపుడపుడు గారాల పుత్రుడు కూడా. ఆ రోజుల్లో పట్టణములో మంచి పేరున్న భవాని పాఠశాలలో అయిదవ తరగతి వరకు చదివించబడినాడు. చాలా బాగా చదువుతున్నాడని ఆశ పడి (కాగల అబద్దం) సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడికి వెళ్ళాక అర్ధమయినది చాలా బాగా చదివే పిల్లలు మన ఊరిలోనే లెక్కపెట్టలేనంత మంది ఉన్నారని, మనమేమి చుక్కలో చంద్రుడు కాదని.

అక్కడ మొదలైనది ర్యాంకుల మోత, ఆ పరుగుల గోస. చదివితే గాని రాని మార్కులు, చదవాలంటేనే ఒకటే తిప్పలు. ప్రతి సంవత్సరం ప్రతి పరీక్షలో పదిలోపు రావడానికి ఆ ప్రయాస, ఆ అద్వితీయ సంఘర్షణల మోత. ఆ అయిదు సంవత్సరముల ప్రయాణం నేటికీ అనుకుంటే అందించే సరికొత్త గుబాళింపు, సకల సద్గుణముల మేళవింపు.

అలా అలా ఇంకొన్ని మధుర సంవత్సరముల చదువులు మన దేశములోనే కొనసాగిన తరువాత, ఆ పై చదువుల కోసం పయనమాయెను అమెరికా. అంతా కొత్తదనం, సదా విచిత్ర వదనం. తెలిసినవి కొన్ని, తెలుసుకోవలసినవి మరిన్ని, అసలు తెలుసుకున్నవి మరికొన్ని. ఆ గమనం విహంగవీక్షణం, ఆ నయనం ఆనందసాగరం, ఆ క్షణం నిత్యనూతనం.

ఆ ఘట్టములో పడిపోయిన క్షణములు కోకొల్లలు, పడవేసుకున్న ఘడియలు కోటాను కోట్లు, పరుగులు తీసిన మైళ్ళు వందలు వేలు. ఎన్ని జరిగినను, ఎంత జరిగిపోయినను క్షేమముగా మన దేశములో తిరిగి వెనకకు రాగలిగాను అంటే మాత్రం దానికి ఒకే ఒక వ్యక్తి కారణముగా చెప్పవలెనంటే, అది నాకన్నా ముందు పుట్టి, నా వెన్నంటి ఉంటూ, ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్న అన్నయ్య రవికాంత్ మెంచు.

వెనకకు రావాలి అన్న ఆలోచనే లేకుండా అమెరికాకు బయలుదేరిన వాడిని, వచ్చాక చాలా రోజుల వరకు వెనకకు తిరిగి చూడడమన్నది సాధ్యపడలేదు, అందుకు కారణములు కూడా లేక పోలేదు. ఆనాటికి ఎంత వెనుక పడినామన్నది కూర్చుని లెక్క వేయలేదు కానీ, వేసుంటే ఆ కిక్కు మరే బ్రాండ్ వేసిన రాకపోయేదేమో !!

అలా తరగతి గదిలో నేర్చుకున్న పాఠముల కన్నా కాలగమనములో విధి నేర్పించిన పాఠములే అప్పుడప్పుడు నిదుర పోనపుడు, తలచి తలచి చూసినపుడు, తీరమును తాకిన అలల వలె, తాకి, తట్టి వెళుతుంటాయి నేటికీ. అమెరికాలో ఏమేమి వదిలేసి వచ్చానో ఇప్పటికీ లెక్క తేలలేదు. కానీ, పోయిన ప్రతిక్షణమును మరల వెనకకు తెచ్చుకోవడానికి ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉందనే చెప్పవలెను.

Featured in

Personal life

Neque ornare aenean euismod elementum nisi quis eleifend quam. Eu turpis egestas pretium aenean pharetra magna. Vel orci porta non pulvinar.

Education

Massa ultricies mi quis hendrerit. Pellentesque dignissim enim sit amet venenatis urna cursus. Ut ornare lectus sit amet. Felis imperdiet.

Publications

Nice Guys Finish First (2002)
The Blind Watchmaker (2004)
Growing Up in the Universe (2006)
Break the Science Barrier (2008)

New Release

Explore Sam's Books

Kanulu

Philosophy

Lack of Comprehension

The Faucibus in ornare quam viverra. Malesuada nunc vel risus commodo viverra maecenas accumsan lacus. Ornare arcu dui vivamus arcu felis bibend a fay.

Blog

Sree Teja Kalam's Writings

కాల ప్రయాణం – కాలమై ప్రారంభం

కొన్ని ప్రయాణములు మధురము ఆ తోటి ప్రయాణికులు సుమధురము కొంత సమయమే అయినను మరువలేము !! అలాంటి ప్రయాణములు దొరికిన వరములు మన గమనము చేరుకోవడానికి సోపానములు !! ఆ ప్రయాణం ముందుగానే కాల

Read More »

అక్షర సిరుల శ్రీకారం – అమ్మగా అక్షర శ్రీకారం

అక్షరముల శ్రీకారం సులక్షణముల శ్రీకారం విలక్షణమయిన శ్రీకారం !! ఆ అక్షరములు ఆశీస్సులుగా శ్రీకారం ఆ సులక్షణములు ఆహార్యముగా శ్రీకారం విలక్షణమయిన బోధన ప్రక్రియగా శ్రీకారం !! కళలను కనులకు చేరువచేయ శ్రీకారం అక్షరములకు

Read More »

ఆది ఆద్యంతం అనుక్షణం విరచితం

ఆ ప్రయాణం తలపించు కురుక్షేత్రం ఆ గమనం కూడిన నిత్య సత్య భక్తిభావం ఆ సామర్థ్యం సర్వదా క్రమశిక్షణ పూరితం ఆ పఠనం సహస్రనామ విరచిత పూజితం ఆ సామరస్యం జ్ఞానవిజ్ఞాన ఆధ్యాత్మిక దైవికం

Read More »

తొలకరి ఆగమనం – పుడమి ఆహ్వానం

తొలకరి చినుకుల జాడ వెచ్చని తనువుల చల్లని నీడ !! శీతల పానీయాలకు వీడ్కోలు పలకగ దుక్కిదున్నె పనికి ఆహ్వానం అందగ !! ప్రకృతి నూతనోత్సాహం చూపగ ఆ వాన నీటిని అదుపులో పెట్టగ

Read More »

ఈ ప్రతిబింబం – ఆ ప్రతిరూపం

నిశ్చలం నిర్మలం ఆనందం గమనం ఆంగికం ఆహార్యం వినిమయం విరచితం !! జ్ఞానం సమస్తం నిర్మాల్యం పవిత్రం మానవీయం మానవత్వం స్వయంకృపం సాంసిద్ధికం !! క్రోధం దహనం ఆగ్రహం అంధకారం అనాలోచితం అపజయం !!

Read More »

కనుల రణం – జయించిన ఆత్మస్థైర్యం

ఆ కనులు చూడక చూసిన యుద్ధం వింటినారి లేకున్నను జరిగిన ఆ రణం !! చూడ కాలమే గాఢాంధకారం ప్రతిక్షణం తెలియని పోరాటం ఆ కనుల జారే కన్నీరు విరచితం ఆ మరణమృదంగం సుపరిచితం

Read More »

Sign up for monthly updates

An email you’ll always want to open.