Skip to content

Shashi Kanth Menchu

About Me

My Story

శశికాంత్ మెంచు అపుడెపుడో సూర్యాపేట పట్టణములో (నల్గొండ జిల్లాలో) దసరా పండుగ సంబరముల నడుమ జన్మించినాడు. మెంచు సుజాత మరియు మెంచు మల్లయ్య గార్ల ద్వితీయ పుత్రుడు, అపుడపుడు గారాల పుత్రుడు కూడా. ఆ రోజుల్లో పట్టణములో మంచి పేరున్న భవాని పాఠశాలలో అయిదవ తరగతి వరకు చదివించబడినాడు. చాలా బాగా చదువుతున్నాడని ఆశ పడి (కాగల అబద్దం) సెయింట్ జేవియర్స్ ఉన్నత పాఠశాలలో చేర్పించారు. అక్కడికి వెళ్ళాక అర్ధమయినది చాలా బాగా చదివే పిల్లలు మన ఊరిలోనే లెక్కపెట్టలేనంత మంది ఉన్నారని, మనమేమి చుక్కలో చంద్రుడు కాదని.

అక్కడ మొదలైనది ర్యాంకుల మోత, ఆ పరుగుల గోస. చదివితే గాని రాని మార్కులు, చదవాలంటేనే ఒకటే తిప్పలు. ప్రతి సంవత్సరం ప్రతి పరీక్షలో పదిలోపు రావడానికి ఆ ప్రయాస, ఆ అద్వితీయ సంఘర్షణల మోత. ఆ అయిదు సంవత్సరముల ప్రయాణం నేటికీ అనుకుంటే అందించే సరికొత్త గుబాళింపు, సకల సద్గుణముల మేళవింపు.

అలా అలా ఇంకొన్ని మధుర సంవత్సరముల చదువులు మన దేశములోనే కొనసాగిన తరువాత, ఆ పై చదువుల కోసం పయనమాయెను అమెరికా. అంతా కొత్తదనం, సదా విచిత్ర వదనం. తెలిసినవి కొన్ని, తెలుసుకోవలసినవి మరిన్ని, అసలు తెలుసుకున్నవి మరికొన్ని. ఆ గమనం విహంగవీక్షణం, ఆ నయనం ఆనందసాగరం, ఆ క్షణం నిత్యనూతనం.

ఆ ఘట్టములో పడిపోయిన క్షణములు కోకొల్లలు, పడవేసుకున్న ఘడియలు కోటాను కోట్లు, పరుగులు తీసిన మైళ్ళు వందలు వేలు. ఎన్ని జరిగినను, ఎంత జరిగిపోయినను క్షేమముగా మన దేశములో తిరిగి వెనకకు రాగలిగాను అంటే మాత్రం దానికి ఒకే ఒక వ్యక్తి కారణముగా చెప్పవలెనంటే, అది నాకన్నా ముందు పుట్టి, నా వెన్నంటి ఉంటూ, ఇప్పటికీ ముందుకు నడిపిస్తున్న అన్నయ్య రవికాంత్ మెంచు.

వెనకకు రావాలి అన్న ఆలోచనే లేకుండా అమెరికాకు బయలుదేరిన వాడిని, వచ్చాక చాలా రోజుల వరకు వెనకకు తిరిగి చూడడమన్నది సాధ్యపడలేదు, అందుకు కారణములు కూడా లేక పోలేదు. ఆనాటికి ఎంత వెనుక పడినామన్నది కూర్చుని లెక్క వేయలేదు కానీ, వేసుంటే ఆ కిక్కు మరే బ్రాండ్ వేసిన రాకపోయేదేమో !!

అలా తరగతి గదిలో నేర్చుకున్న పాఠముల కన్నా కాలగమనములో విధి నేర్పించిన పాఠములే అప్పుడప్పుడు నిదుర పోనపుడు, తలచి తలచి చూసినపుడు, తీరమును తాకిన అలల వలె, తాకి, తట్టి వెళుతుంటాయి నేటికీ. అమెరికాలో ఏమేమి వదిలేసి వచ్చానో ఇప్పటికీ లెక్క తేలలేదు. కానీ, పోయిన ప్రతిక్షణమును మరల వెనకకు తెచ్చుకోవడానికి ఆ ప్రయత్నం ఇంకా కొనసాగుతూనే ఉందనే చెప్పవలెను.

Sample Chapters

Lack of Comprehension

Chapter 1

The Philosopher

Chapter 1

Scavenger of Human Sorrow

Chapter 1

"Viverra nibh cras pulvinar mattis nunc sed blandit libero volutpat. Rhoncus est pellentesque elit ullamcorper dignissim."
Evelyn Duncan
USA Today
"Viverra nibh cras pulvinar mattis nunc sed blandit libero volutpat. Rhoncus est pellentesque elit ullamcorper dignissim."
Kelli Marconi
Mashable
"Viverra nibh cras pulvinar mattis nunc sed blandit libero volutpat. Rhoncus est pellentesque elit ullamcorper dignissim."
Gerald Ellis
Elephant Journal

Stay In Touch

For event info and updates, follow me on social media or see the Events pages.

new Release

The Lack of Comprehension