Skip to content

Blog

అమ్మ అనురాగం

అయితే అమ్మ సంగీతమే
సరిగమల గోరుముద్దలు అనుక్షణమే
పదనిసల పాదుకలు ఇంట ప్రతి క్షణమే !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

జ్ఞాన సమూహం – నిత్య సంతోషం

ఆ అరవిందజ్ఞానాదిత్యం
అద్వితీయ త్రినేత్ర సమూహం
ఆ మాతా సుపుత్ర పుత్రిక సమేతం
ఆక్షణం కాన కనులనిండ సంతోషం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

మనోధైర్యం – ఉన్న నమ్మకం

ఆ అడుగు బలం
తెలుసుకున్న గుండె నిండు ధైర్యం !!
ఆ నడక గమనం
అర్థం చేసుకున్న చేరువ ఆ ధర్మం !!
ఆ మాటలో మౌనం
వినగలిగిన విజయం సదా నీ సొంతం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

కాల సాధన – భవితవ్య క్రమశిక్షణ

ఆ ఆలోచన ఈ క్రమశిక్షణ
ఆ వివరణ ఈ నిత్య సాధన !!
ఆ అడుగులు ఈ చూపులు
ఆ చదువులు ఈ సిరా చుక్కలు !!
ఆ ఆనందం ఈ గమనం
ఆ భవితవ్యం ఈ కాల నిర్ణయం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

తెలుసుకున్న జ్ఞానం – అంధకారం దూరం

ఉండకూడని జ్ఞానం అజ్ఞానం
చూడలేని శబ్ధం కాదు నిశబ్దం !!
దహించివేసే శాంతి అశాంతి
పాటించకూడని నీతి అవినీతి !!

తోడుగా రాకూడని ధర్మం అధర్మం

మోయవలసిన భారం వయోభారం

రుచి చూడాల్సిన రాగం అనురాగం

దూరం ఉంచవలసిన గ్రహం ఆగ్రహం
వెల కట్టలేని నీరు అ కంట కన్నీరు !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

గాతి తప్పిన ప్రకృతి – గుర్తు చేయ మారుతి

ఈనాడు చూడ వచ్చిన కోతి
ఆ చెరువులు పూడ్చవద్దన్న కోతి

ఈ చేష్టలు ఆపాలని అడిగిన కోతి
ఆ చెట్లు నరకమని చెప్పమన్న కోతి !!

అవినీతి గోతిలో పడొద్దన్న కోతి
ఈ మనీ పైత్యం వీడమన్న కోతి
ఆ మానవత్వం పోగేసుకోమన్న కోతి !!

అభయముండమని వేడుకున్న కోతి
ప్రకృతి ధర్మం గుర్తు చేసిన ఈ మారుతి !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

భానుడు లేక – అంధకారం నిండుగా

నీ చూడ సమయమే లేక
ఆరోగ్యం దూరమయి పాయె !!
నీ పలకరింపు లేక
పక్షులు మూగపోయెనాయే !!
నీ రాక పోక
గమనము కాలేకపోతుండెనాయే !!
నీవు లేక
అంధకారం నిండుగా ఇక తొణికిసలాడుతుండెనాయే !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

ఆదిత్య గణితం – కళల సంహితం

ఆ అలల ఆనందం
ఈ కనుల సాగరం !!
ఆ నగవుల మందారం
ఈ సరిగమల మందిరం !!
ఆ చక్కని లెక్కల గణితం
ఈ మనసుల మనోహరం !!
ఆ ఆదిత్య సంహిత సంబరం
ఈ అమ్మ నిత్య కళల సంతోషం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

నిలువగ విజయం – పుడమిని ఆనందం

ఆ చెయ్యి తోడు రాగ
విజయం ఎదురు నిలువనేల !!
ఆ మాట ముందు నిలువగ
అధర్మం వెనక పరుగు తీయనేల !!
ఆ చూపు నవ్వులు చిందించగ
పుడమిన ఆనందం సొంతమే కదా !!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

ప్రశ్న మార్చని విధి

ఎవరూ అడగని ప్రశ్న ఇది
ప్రస్తుతమునకు జవాబు లేనిది
మౌనమే సమాధానం కాగలిగినది
విధి రాసిన తలరాత మార్చలేనిది
విధాత తలపులకు రూపం కావాలిది

✍️ శ్రీ తేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️