Skip to content

Blog

ముందర కాలం – కాన శూన్యం

అమావాస్య ఆగమనం
ఆ శశి లేక ఆఘమాఘం
ఈ శశి రాయక అయోమయం !!
ఆ చుక్కలు లేని ఆకాశం
ఈ సిరాచుక్కలు తాకక కాగితం !!
ఆ కాలం ముందర అంతా సమానం
ఈ కలం ముందంతా కాన శూన్యం !!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

రణరంగమే జీవితం – ధర్మమే ఆయుధం

కాదు ఆనందభైరవి రాగం
కాగల కాల భైరవుడి స్వరం !!
ప్రకృతిలో కలిసిపోతున్న తరుణం
ప్రళయ తాండవ ఆ రుద్ర సమయం !!
పంచభూతముల గమన రుధిరం
ఇంతకు పూర్వం చూడని సమరం !!
కలియుగ కురుక్షేత్ర శుభారంభం
కౌరవులై అర్థకామముల రణరంగం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

మారుతున్న అబద్దం – మారలేక నిజం

వెనకాల నున్నది కాదు అందం
ముందర నున్నది కాలేదు అజ్ఞానం !!
నేటి అబద్ధం రేపు కాగల నిజం
నిన్నటి నిజం రేపటికి నిలువ నిజం !!
తెలుసుకుంటే అసలు అర్థం
తెల్లవారగ నిండు పరమార్థం !!
పరుగులిడు ఆ పరమానందం
ఆపై పరమాత్మతో బంధం మోక్షం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

తెలుగు అక్షరం – రాయగ రమనీయం

అక్షరం రాక అంధకారం
అక్షరం రాయ ఉషోదయం !!
పదం పలకలేక ప్రమాదం
పదం పలుకగ ప్రమోదం !!
వాక్యం కూడక విలాపం
వాక్యం కుదరగ వినోదం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

మాలికలు – మణిమాణిక్యములు

అమ్మ దైవం
అక్షరం తేజం !!
నాన్న దైవం
నమ్మకం బలం !!
గురువు దైవం
గుణం సౌశీల్యం !!

అన్నం పరబ్రహ్మం
అన్నదాత పవిత్రం !!
మానవత్వం సౌభాగ్యం
మనోజ్ఞానం సామర్థ్యం !!
ప్రకృతి పచ్చదనం వరం
ప్రవర్తన క్రమశిక్షణ ఆభరణం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

అక్షర శ్రీకారం – ఆనంద నిలయం

శ్రీకారం బడికి వెళదాము
పలక బలపం పట్టుకుందాము
అక్షరమాలను నేర్చుకుందాము
అచ్చులు హల్లులు దిద్దుకుందాము
ఒత్తులు గుణింతములు సరిచూసుకుందాము !!

అమ్మ ఆవు అని చదువుకుందాము
అందరిని గౌరవించడం తెలుసుకుందాము !!

ఆటలెన్నో ఆడుకుందాము
పాటలు పద్యాలు పాడుకుందాము
ప్రగతి బాటలో కలిసిమెలిసి పయనిద్దాము !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

అక్షర శ్రీకారం – ఆనంద నిలయం

తెలుగు వెలుగు శ్రీకారం
వెన్నెల వెలుగులు శ్రీకారం !!
అక్షర పునాది శ్రీకారం
అజ్ఞాన దూరం శ్రీకారం !!
చిరునవ్వు చిరునామా శ్రీకారం
చిరంజీవుల చైతన్యం శ్రీకారం !!
వేద జ్ఞాన కోవెల శ్రీకారం
ఇంటి చదువుల ఇలాకా శ్రీకారం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

జ్ఞాపకాల ప్రయాణం – నిండు సమ్మోహనం

ఆ జ్ఞాపకం మధురం
ఆ ప్రయాణం నిశ్చలం
ఆ కాలగమనం పవిత్రం !!
ఆ కళల సమ్మేళనం సౌశీల్యం
ఆ కనుల మంత్రం సమ్మోహనం
ఆ కానని చరితం అజరామరం !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

జీవితం లేని యుద్ధం

ఈ యుద్ధం చేరదు ఆ గమ్యం
ఈ యుద్ధం కోరదు ఆ అంతం
ఈ యుద్ధం నిలుపదు ఆ వేగం
ఈ యుద్ధం చూపదు ఆ సహనం !!
ఈ యుద్ధం కాలేదు అసత్యం
ఈ యుద్ధం కాగలదు అనునిత్యం !!!

 

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️

పుస్తక పఠనం – అజ్ఞాన పతనం

ఆ చిన్ని ప్రపంచం చిన్నబోదు
ఈ పుస్తకపఠనం అలుపు కోరదు !!
ఆ ఆలోచనల లోతు తెలియదు
ఈ భవితవ్యం ప్రశ్న ఉంచదు !!
అర్థం చేసుకున్న ఆనందం కలదు
పరమార్థం తెలిసిన క్షణం విలువ తగ్గదు !!!

✍️ శ్రీతేజ కలం ✍️
🕉️ అమ్మ ఆశీర్వాదం 🕉️